bethlehem puramuna lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Bethlehem Puramuna Chithrambu Kalige
Karthaadi Yesu Janminchinapudu
Andhakaarampu Pruthivi Veedhulalo
Modampu Mahima Chodyambuganare
Udayampu Thaaral Mudamuna Baade
Udayincha Yesu Ee Pruthivilona
Mudamunu Galige Mari Samaadhaanam
Padilambuthoda Poojincha Randi ||Bethlehem||
Paramunu Vidachi Nararoopameththi
Arudenchi Yesu Parama Vaidyundai
Narula Dukhamulan Tholaginchivesi
Paraloka Shaanthi Sthiraparache Prabhuvu ||Bethlehem||
Needu Chiththamunu Naadu Hrudayamuna
Mudamuna Jeya Madinentho Yaasha
Needu Paalanamu Pramandu Valene
Ee Dharaniyandu Jaruganga Jooda ||Bethlehem||
Devuni Sannidhi Deenatha Nunda
Paavanayaathma Pavithra Parachun
Paavanudesu Prakaashamichchi
Jeevambu Nosagi Jeevinchu Nedalo ||Bethlehem||
Gathinche Raathri Prakaashinche Kaanthi
Vithaanamuga Vikasinche Nella
Doothala Dhvanitho Pathi Yesu Kreesthu
Athi Premathoda Arudenche Noho ||Bethlehem||
బేత్లేహేం పురమున
బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే
ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||
పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం||
నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం||
దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం||
గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 67 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 69 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 75 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 78 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 94 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 116 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 109 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 68 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 100 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 93 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |