le nilabadu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Le Nilabadu Parugidu Thandri Pani Kosame
Nee Manasulo Prabhuvunu Koluchu Prathi Nimishame
Sangrahinchu Gnaanamanthaa – Sancharinchu Lokamanthaa
Ninnu Aapu Shakthi Kaladaa Lokamandunaa
Neeku Thodu Needa Laaga – Thandri Aathmanivvaledaa
Piriki Aathma Needi Kaadu Parugu Aapaku
Neetiloni Chepalaagaa Eduru Eetha Nerchuko
Pakshi Raaju Pattudalatho Pourushamgaa Saagipo
Kadile.. Nadilaa.. Eduruga Nilabadu Alalaku Jadiyaku ||Le Nilabadu||
Raalla Thoti Kottabadina Suvaarthani Aapakundaa
Pattudalatho Cheppinatti Sthephanu Neeku Maadiri
Yesu Bodha Cheyakantu Elikale Ekamaithe
Rommu Virichi Cheppinatti Aposthalule Maadiri
Eduru Vasthe Kaisarainaa Eduru Thirugu Nesthamaa
Beduru Pedithe Evvadainaa Nidurapokumaa
Manasu Ninda Vaakyamunte Manishi Ninnu Aapaledu
Aathmakunna Aashayamtho Kadulu Munduku
Sajjana Dweshulu Ilalo Sahajam Prabhuvuke Thappaledu Maranam ||Le Nilabadu||
Sontha Kanna Biddalanthaa Vidichi Petti Vellipothe
Ontaraina Thalli Mariya Neti Sthreeki Maadiri
Ilanu Soukhyamentha Unna Penta Thoti Polchukunna
Parama Thyaagi Poulu Gaari Theguva Manaku Maadiri
Brathuku Oda Baddalainaa Thaggipoku Thandri Panilo
Tharigiponi Swaasthyamundi Thandri Chenthana
Cheranu Koodaa Chintha Marachi Kalamu Patti Raasukunna
Prabhuni Priyudu Maargadarshi Manaku Sodari
Gothilona Daachaku Muthyam Lekka Aduguthaadidi Sathyam ||Le Nilabadu||
లే నిలబడు
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు ||లే నిలబడు||
రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం ||లే నిలబడు||
సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం ||లే నిలబడు||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 118 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 117 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 123 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 120 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 143 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 169 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 161 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 117 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 152 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 145 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |