hrudayamanedu thalupu nodda lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Hrudayamanedu Thalupu Nodda – Yesu Naathundu
Nilachi – Sadayudaguchu Dattuchundu – Sakala Vidhamulanu (2) ||Hrudaya||
Paruni Boli Niluchunnaadu – Parikinchi Chooda
Nathadu – Parudu Gaadu Rakshakundu – Praana Snehithudu (2) ||Hrudaya||
Karunaa Sheelundathadu Gaana – Gaachi Yunnaadu
Yesu – Karuna Nerigi Gaaravimpa – Garamu Nyaayambu (2) ||Hrudaya||
Entha Sepu Niluva Betti – Yedpinthu Rathani
Naatha – Dentho Dayache Biluchuchunnaa – Dippudu Mimmulanu (2) ||Hrudaya||
Athadu Mithrudathadu Mithrun – Dakhila Paapulaku
Meera – Lathani Pilupu Vinti Reni – Yathadu Priyudagunu (2) ||Hrudaya||
Jaali Chetha Dana Hasthamula – Jaaapi Yunnaadu
Mimmu – Naalinganamu Seya Gori – Yanishamu Kanipettu (2) ||Hrudaya||
Saatileni Dayagala Vaadu – Sarveshu Suthudu
Thana – Maata Vinedu Vaarala Nella – Sootiga Rakshinchu (2) ||Hrudaya||
Cherchukonudi Mee Hrudayamuna – Shree Yesunaathu
Nathadu – Cherchukonuchu Mee Kichchunu – Chira Jeevamu Krupanu (2) ||Hrudaya||
Athadu Thappaka Kalugajeyu – Nakhila Bhaagyamulu
Meera – Lathani Haththukondu Rappu – Daanandamu Thoda (2) ||Hrudaya||
Brathuku Shaashwathambu Kaadu – Parikinchu Choodu
Gaana – Brathiki Yundu Kaalamunane – Prabhuni Goluvandi (2) ||Hrudaya||
హృదయమనెడు తలుపు నొద్ద
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ||
పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||
కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ||
ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||
అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ||
జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ||
సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ||
చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ||
అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ||
బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 56 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 57 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 63 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 67 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 85 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 95 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 100 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 58 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 87 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 82 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |